Breaking News

విజయశాంతి అధైర్యపడవద్దని పత్రికా ప్రకటన

Dec 19, 2018 19:05 by Admin Admin

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు అగ్రనేతలు పట్టించుకోని తరుణంలో స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి  భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఓటమిపై పార్టీ నేతలు మీడియా సమావే శాలు పెట్టేందుకు సాహసం చేయని దుస్థితిలో విజయశాంతి అధైర్యపడవద్దని పత్రికా ప్రకటనల ద్వారా సందేశం ఇస్తున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమిపై తొలిసారిగా విజయశాంతి స్పందించారు. ఓటమికి భయపడవద్దని మన ముందు పంచాయతీరాజ్ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయని, వాటికి సంసిద్ధం కావాలని పిలుపు నివ్వడం విశేషం. పార్టీ తరపున నేతలు ఎవ్వరు కూడా మాట్లాడని తరుణంలో విజయశాంతి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe