Breaking News

మనోజ్ తివారీ అసహనం

Dec 19, 2018 19:10 by Admin Admin

ఐపీఎల్ తాజా వేలంపై భారత క్రికెటర్ మనోజ్ తివారీ అసహనం వ్యక్తం చేశాడు. 2019 సీజన్ కోసం మంగళవారం జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ తివారీని కోనుగోలు చేయలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. దీంతో అతను ఈ సీజన్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దీనిపై మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా తన అసహనం వ్యక్తం చేశాడు. ‘నా జీవితంలో అసలేం జరుగుతుందో... దేశం తరపున సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్న తరువాత కూడా 14 మ్యాచ్‌ల వరకు అవకాశం రాలేదు. 2017 ఐపీఎల్ సీజన్‌లో అవార్డులు గెలుచుకున్నా కూడా ఏం జరిగిందో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe