Breaking News

పసిడి ధరలు తగ్గుముఖం

Dec 19, 2018 19:14 by Admin Admin

బులియన్ మార్కెట్ చివరి సెషన్‌లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ బుధవారం మాత్రం తిరిగి భారీగా తగ్గుముఖం పట్టాయి. మరో వైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుండటం,  నగల వ్యాపారుల నుంచి డిమాండు తగ్గుతూ వచ్చింది. దీంతో బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 210 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నాటికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 32 వేల దిగువకు పడిపోయి రూ. 31,850కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగాధరం ధర రూ. 31,700 నమోదైంది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. రూ. 25,000 ధర వద్ద కొనసాగుతోంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర 435 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 37,880కి చేరుకుంది. ఇక వారంతపు వెండి ధరలు 448 తగ్గి రూ.37,433కి చేరుకుంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.74,000 ఉండగా.. అమ్మకం ధర రూ.75,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధర పెరిగింది. స్పాట్ గోల్డ్ ధర 0.1శాతం పెరిగి ఔన్సు ధర 1,250.56కి చేరింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe