Breaking News

యుద్ధ విమానాలు సుదూర లక్ష్యాలూ సులువే

Dec 19, 2018 19:19 by Admin Admin

భారత వైమానిక దళానికి అంతరిక్ష శక్తి లభించింది. జీశాట్‌-7ఏ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా రోదసిలోకి పంపింది. జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌11 రాకెట్‌ ద్వారా బుధవారం సాయంత్రం 4.10 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించారు. 11.14 నిమిషాల్లోనే 270 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని 2,250 కిలోల జీశాట్‌-7ఏను అంతరిక్షంలో విడిచిపెట్టింది. కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకోగానే రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 2.33 నిమిషాలకు 69.6కి.మీ. ఎత్తుకు చేరుకోగానే స్ట్రాపాన్‌ 
మోటార్లు, 71.24కి.మీ. ఎత్తులో తొలిదశ మోటారు, 115.1కి.మీ. ఎత్తులో ఉపగ్రహాన్ని కప్పి ఉంచిన ఉష్ణకవచం, 133.1కి.మీ. ఎత్తులో రెండోదశ ఇంజన్‌ విడిపోయాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe