Breaking News

హైకోర్టు విభజనపై కుదిరిన సుముహూర్తం

Dec 19, 2018 19:28 by Admin Admin

హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది.  ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్ర పదేశ్ రాష్ట్రాల్లో కొత్త హైకోర్టులు పని చేయడం ప్రారంభి స్తాయి. ఆ రోజు ఎట్టకేలకు హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది. వికారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సమీపంలోగల నేలపాడు గ్రామంలో కొత్తగా నిర్మించిన భవనం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుంది. ఆ రోజు నుంచే హైకోర్టు అప్పాయింటెడ్ డే గా ప్రకటిస్తూ రాష్ట్రపతి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో  ఉగాది తర్వాతి రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసులన్నింటినీ అక్కడే విచారిస్తారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe