Breaking News

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Dec 21, 2018 18:54 by Admin Admin

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ర్టంలోని అన్ని విద్యా సంస్థల్ని పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో  పొగాకును నిషేధించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశించారు.  తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ర్టంలోని అన్ని జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల ఈ ఆదేశాల్ని  పాటించాలని పేర్కొన్నారు. విద్యా సంస్థల ప్రాంగణంలో ‘పొగ త్రాగరాదు/ పొగాకు రహిత ప్రదేశం‘ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలు పొగాకు రహిత ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈనెల 28లోపు అన్ని జిల్లాల డీఈఓలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు హామీ పత్రం సమర్పించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe