Breaking News

ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు

Dec 23, 2018 08:51 by Admin Admin

ఏపీ, తెలంగాణ లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తమకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. తమ పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించడంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా పార్టీ గుర్తుగా ‘గాజు గ్లాసు’ను ఇచ్చిన ఎన్నికల సంఘానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాకు ఈ ‘గాజు గ్లాసు’తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతేకాక.. ఇది మన దేశంలో సామాన్యుడి గుర్తింపు’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe