Breaking News

పేలిపోయిన క్రకటోవా అగ్నిపర్వతం

Dec 23, 2018 14:45 by Admin Admin

ఇండోనేషియాను వరుసగా ప్రకృతి విపత్తులు వెంటా డుతున్నాయి. నిద్రాణంలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సునామీ పోటెత్తింది. ఇండొనేషియా కాలమ నం ప్రకారం శనివారం రాత్రి 9.27 గంటలకు సండా జల సంధిని సునామీ ముంచెత్తింది. రాకాల అలల ధాటికి ఇప్పటి వరకు 222 మంది మృత్యుపాలయ్యారు. దాదాపు 800 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదముందని అధికారులు వెల్లడించారు. 20 మందికిపైగా గల్లంతయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు చనిపోయినవారిలో అత్యధికులు విదేశీ టూరిస్టులే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. తీవ్ర సునామీ వల్ల చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe