Breaking News

కనీస నిల్వల పేరుతో బ్యాంకుల బాదుడు

Dec 23, 2018 14:54 by Admin Admin

బ్యాంకులో కనీస నిల్వల  మొత్తాన్ని నిల్వ చేయలేని, ఏటీఎంలో అధికంగా వాడకం వంటి కార ణాలతో బ్యాంకు వినియోగదార్ల నుంచి ఈ ఏడాది రూ. 10,000 కోట్ల మేరా రాబట్టినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు పార్లమెంటుకు ఇటీవల నివేదించాయి.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 2012 నుంచి కనీస నిల్వల చార్జీలను అమలు చేస్తుంది. అయితే తిరిగి 2016 మార్చిలో రద్దు చేసింది. మళ్లీ 2017 ఏప్రిల్ 1 నుంచి కనీస నిల్వల ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టింది. 

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అత్యధికంగా రూ.2,894 కోట్లు వసూళ్లు చేసింది.  ప్రయివేటు బ్యాంకులు కూడా బోర్డులు నిర్ణయించిన దాని ప్రకారం వసూళ్లు చేస్తున్నాయి.  2015-16 నుంచి 2018-19 సెప్టెంబర్ వరకు అంటే ఈ మూడున్నరేళ్లలో సేవింగ్ ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని ఖాతాదారుల నుంచి పిఎస్‌బిలు రూ.6,246 కోట్లు వసూళ్లు చేశాయి.  

ఎటిఎంల్లో ఉచిత లావాదేవీలు మించి వాడుకున్న వారి నుంచి రూ.4,145 కోట్లు రాబట్టుకున్నాయి.  పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.493 కోట్లు, కెనరా బ్యాంకు రూ.352 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.348 కోట్లు. బ్యాంకు ఆఫ్ బరోడా రూ.328 కోట్లు చొప్పున ఖాతాదారులపై భారం వేశాయి. ఎటిఎం ఉచిత లావాదేవీలు మించి వాడిన వారి నుంచి ఎస్‌బిఐ రూ.1,554 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.464 కోట్లు, పిఎన్‌బి రూ.323 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.241 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.183 కోట్లు చొప్పున వసూళ్లు చేశాయి. జన్ ధన్ యోజన ఖాతాలకు కనీస నిల్వల నిబంధన వర్తించదు. 42 నెలల్లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.10వేల కోట్ల మేర వసూళ్లు చేయగా, ప్రయివేటు రంగ బ్యాంకులు కూడా భారీగానే పిండాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe