Breaking News

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టింగ్‌లు

Dec 27, 2018 23:48 by Admin Admin

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినందుకు కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామానికి చెందిన మామిడి సాయిరాం(23) అలియాస్‌ జెట్టి సాయిరాం అనే యువకుడిపై కొత్తపల్లి పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద కేసు నమోదు చేశారు. సాయిరాం తన ఫోన్‌ ద్వారా ఒక మతానికి చెందిన దేవుడి ఫొటోపై అభ్యంతరకరమైన మరో ఫొటో, వ్యాఖ్యలతో పోస్టింగులు పెట్టినట్లు కొత్తపల్లి ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe