Breaking News

రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Jan 01, 2019 21:29 by Admin Admin

తెలుగు రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చలి వణికిస్తోంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కనీసం రెండంకెలు కూడా చేరడం లేదు. ఉదయం పది దాటితే కాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. రాత్రి కాకముందే ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్‌లు స్వైర విహారం చేస్తున్నాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe