Breaking News

పుజారా శ‌త‌కం సాధించాడు

Jan 03, 2019 00:25 by Admin Admin

టీమిండియా  బ్యాట్స్‌మెన్ ఛ‌తేశ్వ‌ర్‌ పుజారా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివ‌రి టెస్ట్‌లోనూ సెంచ‌రీ చేసి స‌త్తా చాటాడు. నాలుగు టెస్ట్‌ల‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న చివ‌రి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ రాహుల్ (9) అవుటైన అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన పుజారా (122 నాటౌట్‌) శ‌త‌కం సాధించాడు. ఓపెన‌ర్ మ‌యాంక్‌, కెప్టెన్ కోహ్లీల‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాలు న‌మోదు చేశాడు. 200 బంతుల్లో 13 ఫోర్లతో 101 ప‌రుగులు చేసి సిస‌లైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe