Breaking News

మల్టీలెవల్‌ కంపెనీ పేరుతో మోసం

Jan 23, 2019 10:40 by Admin Admin

మల్టీలెవల్ మోసం బయటపడింది. మల్టీలెవల్‌ కంపెనీ పేరుతో మోసం చేసిన సంఘటన ఉప్పల్‌లో వెలుగుచూసింది. రూ. 100 కోట్లకుపైగా జిన్నా శ్రీకాంత్‌ అనే కేటుగాడు టోపీ పెట్టాడు. కరక్కాయల పొడి తరహాలోనే వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామంటూ నమ్మించి మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ఈ మోసాలకు పాల్పడ్డారు. గతంలో మహాలైఫ్‌ పేరుతో కూడా జిన్నా శ్రీకాంత్‌ భారీ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితుడు జిన్నా శ్రీకాంత్‌, అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe