Breaking News

ఎవ్వ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పేది లేదు

Jan 24, 2019 01:10 by Admin Admin

వీర‌నారి ఝాన్సీల‌క్ష్మీబాయి జీవిత‌క‌థ ఆధారంగా స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ`. తెలుగు ద‌ర్శ‌కుడు క్రిష్‌, కంగ‌న ఈ సినిమాకు ద‌ర్శ‌కులు. ఈ సినిమాలో ఝాన్సీ ల‌క్ష్మీబాయి చరిత్ర‌ను వ‌క్రీక‌రించి చూపించార‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ మ‌హారాష్ట్ర‌కు చెందిన క‌ర్ణిసేన కార్య‌కర్త‌లు ఆందోళ‌న చేస్తున్నారు.
నేనూ రాజ్‌పుత్‌నే. నేను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌ను. సెన్సార్ బోర్డు క్లియ‌రెన్స్ ఇచ్చిన త‌ర్వాత కూడా ఆందోళ‌న చేస్తే క‌ర్ణిసేన‌ల‌ను నాశనం చేస్తాన‌`ని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల క‌ర్ణిసేన కార్య‌కర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని బెదిరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి కంగ‌న స్పందించింది. `ఎవ్వ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పేది లేదు. నా త‌ప్పు లేకుండా ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేదు. ల‌క్ష్మీబాయి నా బంధువు కాదు. ఆమె భార‌త జాతి మొత్తానికి ముద్దు బిడ్డ‌. ఈ సినిమాలో ఆమె గురించి ఎక్క‌డా చెడుగా చూపించ‌లేద‌`ని కంగ‌న తెలిపింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe