Breaking News

వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని

Jan 24, 2019 18:17 by Admin Admin

కాంగ్రెస్ పార్టీలో తాను అంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్ తోసిపుచ్చారు. రాధన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న తాను పార్టీ తీరు పట్ల అసహనంతో ఉన్నానని ఎవరు వార్తలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని అల్పేశ్ ఠాకూర్ వాపోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నా..రాహుల్ నాయకత్వం పట్ల తమకు నమ్మకం ఉందని అల్పేశ్ ఠాకూర్ తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe