Breaking News

టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది

Jan 27, 2019 19:06 by Admin Admin

నిరుద్యోగ యువతీ యువకుల కోసం టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది. 10, ఇంటర్, డిగ్రీపాస్ /ఫెయిల్ అయిన 18 నుంచి 27 ఏండ్ల వయస్సు వారికి నాలుగు నెలల పాటు కంప్యూటర్, బేసిక్స్, ఐటీ స్కిల్స్, ఎంఎస్-ఆఫీస్, ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బీకామ్ పూర్తి చేసిన వారికి ట్యాలీ, ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్‌టీ, ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ, పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ లోపు తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ 9515665095 లేదా 9100330378లలో సంప్రదించాలని తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe