Breaking News

యాదగిరిగుట్టలో మోడల్ బస్‌స్టేషన్

Jan 29, 2019 19:31 by Admin Admin

పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని, 14 ఎకరాల భూమిని కేటాయించినట్టు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మించనున్న మోడల్ బస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం యా దగిరిగుట్ట డిపోలో ఆర్‌ఎం విజయకుమార్‌తోపాటు ఇతరఅధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈడీ మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రిలో రూ. 14 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో మోడల్ బస్టాండ్ నిర్మిస్తామ న్నారు. 30 ఎకరాలు కేటాయించాలని గతంలో వైటీడీఏ అధికారులను కోరగా 14 ఎకరాలు కేటాయించారన్నారు. సైదాపురం పరిధిలో 10 ఎకరాల్లో బస్‌డిపో, యాదాద్రి కొండ వెనుక నాలుగు ఎకరాల్లో బస్‌స్టేషన్ నిర్మించున్నట్టు చెప్పారు. ఇందుకు మరో ఎకరం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్‌కు సూచించామన్నారు. మల్టీప్లెక్స్, ఫుడ్‌కోర్ట్సు, వెయిటింగ్‌హాల్‌తోపాటు ఏసీ మీటిం గ్‌హాల్ నిర్మిస్తామన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe