Breaking News

వాహన చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నయా అయితే సీజ్

Jan 29, 2019 19:53 by Admin Admin

వాహన చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నయా.  లేదంటే ఆ వాహనాలను సీజ్ చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రతి రోజు www.echallan.org/publicview/.లో పరిశీలించుకోవాలని వాహనదారులకు సూచించారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సెంచరీలు దాటారని తేలింది. దీన్ని చాలా ప్రమాదకరంగా ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. వాహనదారుడి మీద 10 ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్‌లు మించితే ఆ వాహనాన్ని అక్కడే సీజ్ చేసి, వారిపై చార్జీషీటును దాఖలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe