Breaking News

గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే మంటలు

Jan 29, 2019 23:45 by Admin Admin

Hyderabad: మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని అగ్నిప్రమాదం జరిగింది. కాసామియా ఫుడ్‌కోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు.  అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న కట్టడాలకు మంటలు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే అక్కడ పనిచేస్తున్న వారు సురక్షితంగా బయటపడగలిగారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe