Breaking News

అయోధ్య‌లో రామ మందిర‌ నిర్మాణం ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ

Jan 30, 2019 18:54 by Admin Admin

అయోధ్య‌లో రామ మందిర‌ నిర్మాణం  ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ ముహూర్తం ఖ‌రారైంది. రామాల‌య నిర్మాణం మొద‌లువుతుంద‌ని ఇవాళ ప‌ర‌మ ధ‌ర్మ సంస‌ద్ పేర్కొన్న‌ది. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో పాల్గొనేందుకు ప‌ర‌మ ధ‌ర్మ సంస‌ద్ స‌మావేశమైంది. దేశంలోని ప్ర‌ముఖ మ‌ఠాల‌కు చెందిన మ‌త పెద్ద‌లు ఆ స‌మావేశంలో భేటీ అయ్యారు. స్వామీ స్వ‌రూపానంద నేతృత్వంలో ఈ భేటీ జ‌రిగింది. అయోధ్య రామ మందిర నిర్మాణంలో సుప్రీం కోర్టు తీర్పును గౌర‌విస్తామ‌ని ధ‌ర్మ సంస‌ద్ పేర్కొన్న‌ది. నాలుగు రాళ్ల‌ను తీసుకుని శంకుస్థాప‌న కోసం అయోధ్య‌కు వెళ్తామ‌ని ధ‌ర్మ సంస‌ద్ స‌భ్యులు తెలిపారు. అయితే 114వ సెక్ష‌న్‌ను అతిక్ర‌మించ‌కుండానే అయోధ్య‌కు వెళ్ల‌నున్న‌ట్లు వాళ్లు చెప్పారు. అయోధ్య‌లో ఉన్న 67 ఎక‌రాల భూమిని రామ జ‌న్మ‌భూమి న్యాస్‌కు అప్ప‌గించాల‌ని సుప్రీంను కేంద్రం కోరిన విష‌యం తెలిసిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe