Breaking News

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

Jan 30, 2019 18:58 by Admin Admin

భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక మిగిలిన రెండు వన్డేలు కూడా దక్కించుకొని సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో టీం ఇండియా బరిలోకి దిగుతోంది. అయితే సుదీర్ఘ సిరీస్‌ల నేపథ్యంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఈ మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe