Breaking News

గజగజవణుకుతున్న జనం లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు

Jan 30, 2019 19:10 by Admin Admin

 అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది శీతాకాల మంచు దడపుట్టిస్తున్నది. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ నుంచి వీస్తున్న తీవ్ర చలిగాలులతో అమెరికా పశ్చిమ మధ్య (మిడ్‌వెస్ట్) ప్రాంతం హిమఖండంలా మారిపోయింది. దీంతో అక్కడి లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. డకోటా నుంచి ఓహియో వరకు దాదాపు డజను రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చలి గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరింది. చికాగోతో పాటు పలు ప్రాంతాల్లో మైనస్ 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. బుధవారం చలిగాలులు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయన్న నిపుణుల అంచ నాతో అధికారులు పాఠశాలలతోపాటు కార్యాలయాలను, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. పోస్టల్ సర్వీసులతోపాటు వందల విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇండ్లలోనే ఉండాలని సూచించాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో బుధవారం మైనస్ 10 నుంచి మైనస్ 40 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిన్నెసోటాలో ఉష్ణోగ్రత మైనస్ 65 డిగ్రీల వరకు పతనమయ్యే అవకాశమున్నదని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌డబ్ల్యూఎస్) అంచనా వేసింది. చికాగోలో చలి అంటార్కిటికాలోని ప్రాంతా ల్లో కంటే తీవ్రంగా ఉండవచ్చన్నది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe