Breaking News

అశ్లీల దృశ్యాలు ఉన్నాయని జైలుశిక్ష

Feb 01, 2019 18:58 by Admin Admin

ఆస్ట్రేలియాలో భారత దేశానికి చెందిన 32ఏండ్ల మన్‌ప్రీత్‌ సింగ్‌ను అక్క‌డి అధికారులు అరెస్ట్ చేశారు. ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని అత‌నికి జైలుశిక్ష కూడా ప‌డింది.  ముందు అతనిపై ఎలాంటి కేసులు లేనందున 7 నెలల జైలు శిక్షతో పాటు 500 అమెరిక‌న్ డాల‌ర్ల‌ను జ‌రిమానాగా విధించింది. అందులో 2 నెలలు మాత్రమే జైలు శిక్ష అనుభ‌వించాల‌ని.. మంచి ప్రవర్తనతో ఉంటే ఆ తరువాత 1000 డాలర్ల పూచీ కత్తుతో బయటకు రావచ్చని తెలిపింది. అయితే మిగ‌తా ఐదు నెలలు కోర్టు పరిధిలోనే ఉండాలని ఆ త‌ర్వాత‌నే భార‌త్‌కు పంపిస్తామ‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది. 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe