Breaking News

ఆరోగ్య బీమాకు రూ.6,400 కోట్లు

Feb 01, 2019 19:04 by Admin Admin

ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ.61,398 కోట్లు . రెండు ఆర్థిక సంవత్సరాల్లో జరిపిన కేటాయింపుల కంటే ఎక్కువ. 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి రూ.52,800 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈ బడ్జెట్‌లో కేటాయింపులను 16 శాతం పెంచింది.  ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేవై) బీమా పథకానికి రూ.6,400 కోట్లు కేటాయించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్లకుపైగా పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు జాతీయ పట్టణ ఆరోగ్య పథకం కింద రూ.250 కోట్లు, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద మరో 1,350.01 కోట్లు కేటాయించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe