Breaking News

మూడోరోజుకు హజారే నిరాహార దీక్ష

Feb 01, 2019 19:08 by Admin Admin

లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటుతోపాటు రైతు సమస్యల పరిష్కారం కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బీపీ, షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయని తెలిపారు. రైతాంగాన్ని గట్టెక్కించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని హజారే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హజారేకు మద్దతుగా స్థానికులు భారీ సంఖ్యలో దీక్షాస్థలికి తరలివచ్చారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe