Breaking News

గండిపేట సుందరీకరణ పనులు

Feb 01, 2019 19:16 by Admin Admin

గండిపేట(ఉస్మాన్‌సాగర్‌) సుందరీకరణ పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రూ.35.60కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులిచ్చింది. హెచ్‌ఎండీఏ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. పనులను ప్రారంభించేందుకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు పనులు పూర్తి చేసే లక్ష్యంతో హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
  
పార్కులను ఏర్పాటు చేసి గ్రీనరీ అభివృద్ధి చేయనున్నారు.  గండిపేట చుట్టూరా 36కిలోమీటర్లు సైక్లింగ్‌ ట్రాక్‌ను, వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. పచ్చనిచెట్లతో ప్రకృతి శోభాయమానంగా గండిపేటను తీర్చిదిద్ది పలు రకాల పా ర్కులను ఏర్పాటు చేసి వినోద కార్యక్రమాలకు అణువుగా చేయాలని నిర్ణయించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe