Breaking News

అధిక వడ్డీ ఇస్తామని మోసం

Feb 02, 2019 20:04 by Admin Admin

రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.1.80 కోట్లు వసూలు చేసి డిపాజిటర్లను మోసం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆన్‌లైన్‌లో షేర్‌ మార్కెట్ పేరుతో డిపాజిట్లు సేకరించేందుకు రెండేళ్ల క్రితం వరంగల్‌లో రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. పాత్రదారులుగా ఉన్న సంచర్ల రాము, ఐత అరుణ్‌కుమార్.. సుమారు 200 మంది నుంచి రూ.1.80 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. డిపాజిటర్లకు పెట్టుబడిపై ప్రతీ నెల 15 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. 200 మంది ఇందులో పెట్టుబడులు పెట్టినా వడ్డీ సక్రమంగా ఇవ్వకపోవడంతో మోసపోయారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe