Breaking News

బీకాం విద్యార్థులు ఫిజిక్స్ పాఠాలు వినొచ్చు

Feb 02, 2019 20:10 by Admin Admin

రాష్ట్రంలో ఇకపై గణితం.. చరిత్ర కలిపి చదువుకోవచ్చు. బీకాం విద్యార్థులు ఫిజిక్స్ పాఠాలు కూడా వినవచ్చు. సైన్స్ విద్యార్థులు అర్థశాస్త్రాన్ని అభ్యసించవచ్చు. డిగ్రీలో తాము ఎంపిక చేసుకున్న గ్రూపు సబ్జెక్టులతోపాటు అదనంగా తమకు నచ్చిన సబ్జెక్టులను నేర్చుకోవడానికి సీబీసీఎస్ ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నది కళాశాల విద్యాశాఖ. ఇందుకు అనుగుణంగా కొన్ని కాంబినేషన్లతో కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని కళాశాలల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ చెప్పారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలు రెండేండ్లుగా ఆలస్యమవుతూ వస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2019-20 విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరిగా సీబీసీఎస్ విధానం అమలుచేయడంపై దృష్టిసారించి, అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe