Breaking News

టాస్ గెలిచిన ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు

Feb 02, 2019 20:20 by Admin Admin

ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ప్రారంభ‌మైన చివ‌రి వ‌న్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆనందం  ఎంతో సేపు నిల‌వ‌లేదు. కెప్టెన్‌, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (2) ఆరంభంలోనే తొలి వికెట్‌గా వెనుదిర‌గాడు. 8 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. మ‌రో నాలుగు ప‌రుగుల అనంత‌రం మ‌రో ఓపెన‌ర్ ధ‌వ‌న్ (6) కూడా అవుట‌య్యాడు. రోహిత్ స్థానంలో క్రీజులోకొచ్చిన శుభ్‌మ‌న్ గిల్ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయాడు. మ‌రొక్క ప‌రుగు అనంత‌రం ధోనీ (1) కూడా పెవిలియ‌న్ చేరాడు. 18 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్లు పోగొట్టుకుని క‌ష్టాల్లో ప‌డింది. భార‌త్ ప్ర‌స్తుతం 10 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 22 ప‌రుగులు చేసింది. రాయుడు (1 నాటౌట్‌), విజ‌య్ శంక‌ర్ (4 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో హెన్రీ, బౌల్ట్ రెండేసి వికెట్లు ద‌క్కించుకున్నారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe