Breaking News

సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య

Feb 05, 2019 21:15 by Admin Admin

Hyderabad : సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య  చేసుకుంది. శ్రీనగర్‌ కాలనీ సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe