Breaking News

ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని తాత్కాలికంగా రద్దు

Feb 05, 2019 21:20 by Admin Admin

అత్యవసర పనులు కారణంగా పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం వాసు దేవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు నెంబరు 56501 విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్‌ రైలుని ఉదయం వేళ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. నెంబరు 56502 హుబ్లీ - విజయవాడ ప్యాసింజర్‌ని ఈ నెల 5 నుంచి 19 మధ్యన రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నెంబరు 56503 బెంగళూరు - విజయవాడ ప్యాసింజర్‌ రైలు ఈ నెల 6 నుంచి 20వ తేదీ మధ్యన, నెంబరు 56504 విజయవాడ - బెంగళూరు ప్యాసింజర్‌ రైలుని ఈ నెల 6 నుంచి 20వ తేదీ మధ్యన రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
నెంబరు. 18463 భువనేశ్వర్‌ - బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 9న సత్యసాయి ప్రశాంతి నిలయం వరకే నడుపుతున్నట్టు వాసుదేవరెడ్డి తెలిపారు. నెంబరు 18464 బెంగళూరు - భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 10న బెంగళూరు నుంచి కాకుండా సత్య సాయి ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరుతుందని తెలిపారు. 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe