Breaking News

బాసరలో ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు

Feb 08, 2019 18:47 by Admin Admin

Nirmal: పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకం, సంకల్ప పూజ అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, హారతి, మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తులు తమ చిన్నారులకు వేద పండితులచే అక్షరశ్రీకారాలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe