Breaking News

పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

Feb 08, 2019 19:06 by Admin Admin

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయం 25వ వార్షికోత్సవం ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 10న తెల్లవారుజాము 3 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అనంతరం ఉత్సవాలు మొదలవుతాయి. 11న సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారికి పల్లకిసేవ నిర్వహిస్తారు. 12 రథోత్సవం రోజు దిక్పాలక భైరవ బలిహరణం, రథపూజ, పుర్ణాహుతి, అనంతరం పెద్దమ్మ తల్లి రథోత్సవం జరుగుతుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe