Breaking News

చకచకా సాగుతున్న ట్రాక్ నిర్మాణ పనులు

Feb 09, 2019 18:46 by Admin Admin

గజ్వేల్ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రైలుప్రయాణం మార్చిలో నెరవరేనున్నది. ఢిల్లీ, ముంబై, తిరుపతి, విజయవాడ వంటి దూరప్రాంతాలకు వెళ్లడానికి హైదరాబాద్‌కు వెళ్తే తప్ప, రైలు సౌకర్యంలేని గజ్వేల్ ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు చొరవతో ఆ కొరత తీరనున్నది. మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గంలో తొలిదశ గజ్వేల్ వరకు పూర్తిచేసి నెలలోపు రైలును పరుగులు తీయించడానికి రైల్వే యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నది. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు ట్రాక్ ప నులు పూర్తి కావస్తుండగా రామాయిపల్లి వద్ద జాతీయరహదారి క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే రైల్వేట్రాక్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe