Breaking News

42మంది జవాన్లు వీరమరణం

Feb 14, 2019 10:56 by Admin Admin

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య  పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 42మంది అమరులైనట్టు తెలుస్తోంది. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్టు సమాచారం. దాడులకు బాధ్యత వహిస్తూ.. జైషే మహమ్మద్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe