Breaking News

రాజకీయ వ్యాఖ్యలొద్దు

Feb 15, 2019 19:22 by Admin Admin

పుల్వామా దాడికి దీటుగా బదులిచ్చేందుకు దేశం మొత్తం ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత సున్నిత, భావోద్వేగ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని పార్టీలు, నేతలను కోరారు. ‘‘మమ్మల్ని విమర్శించే వారి భావోద్వేగాలను మేం అర్థం చేసుకోగలం. అందుకు వారికి పూర్తి హక్కు ఉంది కూడా. కానీ, ఇది సున్నిత, భావోద్వేగ సమయం. అందుకే, రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నా’’ అని అన్నారు. ఉగ్రవాద భూతాన్ని, దానికి కారకులను సమూలంగా నిర్మూలించడానికి ఏకం కావాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe