Breaking News

జ‌వాన్లకు తుది వీడ్కోలు

Feb 16, 2019 11:03 by Admin Admin

పుల్వామా దాడిలో అమ‌రులైన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల భౌతిక‌దేహాలు  వారి గ్రామాల‌కు చేరుకుంటున్నాయి. పుల్వామా దాడిలో 49 మంది జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ జ‌వాన్ల‌కు శుక్ర‌వారం ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ నివాళి అర్పించారు. ఇవాళ ఉద‌యం నుంచి జ‌వాన్ల పార్థివ‌దేహాలు ఆయా రాష్ట్రాల‌కు వెళ్లాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అమ‌రులైన జ‌వాన్ల‌కు ఘ‌నంగా నివాళ్లు అర్పించాయి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు.. జ‌వాన్ల అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు. వీర‌మ‌ర‌ణం పొందిన వారిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. జాతీయ జెండాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ జ‌వాన్ల‌కు సెల్యూట్ చేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe