Breaking News

ఉగ్ర స్థావరాల ధ్వంసం చేయాలి

Feb 20, 2019 21:11 by Admin Admin

భారత్‌ ఉగ్రవాద పీడిత దేశమని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాలుగా సరిహద్దుల ఆవల నుంచి పోషిస్తున్న, సహకరిస్తున్న ఉగ్రవాదంతో సతమతమవుతోందని, వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని ఇతర దేశాలపై రుద్దడాన్ని ప్రపంచమంతా తిరస్కరించాలని.. టెర్రరిస్టు స్థావరాలను, మౌలిక వసతులను నేలమట్టం చేయాలని.. దానికి ఆర్థిక సహకారం అందించడం ఆపాలని పిలుపిచ్చారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత పర్యటనను పురస్కరించుకుని మోదీ సౌదీ అరబిక్‌ పత్రిక ‘ఒకాజ్‌’, ఆంగ్ల పత్రిక ‘సౌదీ గెజిట్‌’లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ బుధవారం ఆయా పత్రికల్లో ప్రచురితమైంది. అతివాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ సౌదీకి అత్యంత సన్నిహిత దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాద ముప్పు అన్ని దేశాలకూ, సమాజాలకూ ఉందని.. దీనిని ఒక జాతి, మతం, సంస్కృతికి ఆపాదించడం తగదని మోదీ చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe