Breaking News

రెండో వన్డేలో భారత్ విజయం

Mar 05, 2019 16:21 by Admin Admin

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 8 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాంటింగ్ చేపట్టిన టీమిండియా 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ 2-0తో లీడ్‌తో ముందంజలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్థాయినిస్ 52 పరుగులు, హ్యాండ్‌స్కోంబ్ 48 పరుగులు, ఖవాజా 38 పరుగులు, ఫించ్ 37 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా బుమ్రా, విజయ్ శంకర్‌లకు 2 వికెట్లు తీశారు. జడేజా, కేదార్ జాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe