Breaking News

దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చర్యలు

Mar 05, 2019 16:25 by Admin Admin

తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమలు, ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ బదులు జూట్ సంచులు అందుబాటులోకి తేవాలని సూచించారు. 50 మైక్రాన్లకు తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్ల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe