Breaking News

సహనం అనే మొట్టమొదటి పునాదిపై పాకిస్థాన్ నిర్మాణం

Mar 05, 2019 16:31 by Admin Admin

హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర మంత్రిపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది. రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి ఫయాజుల్ హసన్ హిందువుల మతాచారాలను ఎగతాళి చేయటంపై సొంత పార్టీ నేతలు, మైనారిటీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ మంత్రిని వెంటనే పదవి నుంచి తొలిగించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్‌ను ఆదేశించారు. ఒకరి మత విశ్వాసాలను కించపరచడం సరైంది కాదు. సహనం అనే మొట్టమొదటి పునాదిపై పాకిస్థాన్ నిర్మాణం జరిగింది అని అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం గత నెల 24న ఒక కార్యక్రమంలో మాట్లాడిన హసన్ హిందువులు గోమూత్రం తాగేవారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe