Breaking News

మహేశ్ బాబు నిర్మాతగా మేజర్

Mar 05, 2019 16:34 by Admin Admin

మహేశ్ బాబు నిర్మాతగా మేజర్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమా ఎందుకు చేయడం లేదని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు మహేశ్. ప్రేక్షకులకు చూపించాల్సిన కొన్ని కథలుంటాయి. మేజర్ చిత్రం కూడా అలాంటిదే. ఈ సినిమాలో నాకు నటించాలని ఉన్నా..కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. మేజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు. ఈ చిత్రం కోసం అడివి శేష్ చాలా పరిశోధన చేశాడు. ఈ పాత్రకు అడివిశేష్ సరిగ్గా సరిపోతాడనిపించినట్లు మహేశ్ చెప్పాడు. ఎన్ఎస్ జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అడివి శేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe