Breaking News

సివిల్స్2018 తుది ఫలితాలు విడుదల

Apr 05, 2019 11:03 by Admin Admin

సివిల్స్‌‌ - 2018 పరీక్ష ఫైనల్ రిజల్ట్స్‌ శుక్రవారం రిలీజ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 759 మంది ఎంపికయ్యారు. ఫలితాల్లో కనిషక్ కటారియా ప్రథమ స్థానంలో నిలవగా.. అక్షత్‌ జైన్‌ రెండో ర్యాంకు, జునైద్‌ అహ్మద్‌కు మూడో ర్యాంకుల్లో నిలిచారు. ఇక అమ్మాయిల్లో సృష్టి జయంత్ దేశ్‌ముఖ్ ఐదో ర్యాంకు సాధించారు. తెలుగువాళ్లలో కర్ణాటి వరుణ్‌ రెడ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకుల్లో నిలిచారు. సెప్టెంబర్‌ - అక్టోబర్‌ సమయంలో సివిల్స్‌ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తిచేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe