Breaking News

ఎస్సై పోస్టుల రాత పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు

Apr 12, 2019 18:40 by Admin Admin

ఎస్సై, ఏఎస్సై పోస్టుల  రాత పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్‌ 15 (సోమవారం) నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటించింది. ప్రాథమిక, శరీర దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన ఎస్సై అభ్యర్థులకు ఏప్రిల్‌ 20 నుంచి తుది రాతపరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఏప్రిల్‌ 15న ఉదయం 8 నుంచి 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో లాగిన్‌ అయ్యి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివా్‌సరావు తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉంటే.. బోర్డు అధికారులను support@tslprb.inకు ఈ మెయిల్‌ పంపడం ద్వారా సంప్రదించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి 93937-11110, 93910-05006కు ఫోన్‌ చేసి పరిష్కరించుకోవాలని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. మరోవైపు ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషా పేపర్లలో అభ్యర్థులు తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలని, ఈ పేపర్లలో నెగటివ్‌ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. భాషా పరీక్షల్లో రెండు విభాగాలుంటాయని, పార్ట్‌-ఏలో ఆబ్జెక్టివ్‌కు 50 మార్కులు ఉంటాయన్నారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు ఉంటుందని, తప్పుడు సమాధానానికి పావు మార్కును తగ్గిస్తారని తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe