Breaking News

విద్యుత్ వాహనాలపై SBI రాయితీ

Apr 22, 2019 18:45 by Admin Admin

విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ వాహనాలకోసం తీసుకునే రుణాలపై 20 బేసిస్ పాయింట్ల మేర రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఎస్‌బీఐ గ్రీన్ కారు లోన్ పథకం వాహన రుణాల విభాగాన్ని పూర్తిగా మార్చివేయనున్నదని బ్యాంక్ ఎండీ, రిటైల్-డిజిటల్ బ్యాంకింగ్ పీకే గుప్తా తెలిపారు. రుణాలు తీసుకున్న వారు ఎనిమిదేండ్ల వరకు తిరిగి చెల్లింపులు జరుపుకునే అవకాశం కల్పించింది బ్యాంక్.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe