Breaking News

మామిడి తోటలో మంటలు చెలరేగాయి

May 07, 2019 14:19 by Admin Admin

గంగారం గ్రామం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమీపంలోని మామిడి తోటలో ఉన్న కరెంటు తీగలు ఒకదానికొకటి తగలి మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెట్లపై పడటంతో సుమారు నాలుగు వందలకు పైగా మామిడి చెట్లు కాలిపోయాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన జరిగిన సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe