Breaking News

ముంబై ఇండియన్స్‌ను ఐదోసారి ఫైనల్

May 07, 2019 14:28 by Admin Admin

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (37 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ధోనీ (29 బంతుల్లో 37; 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో రాహు ల్ చహర్‌తో పాటు కృనాల్ (1/21) సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశా డు. లక్ష్యఛేదనలో ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధసెంచరీతో మెరిస్తే.. ఇషాన్ కిషన్ (28; 1 ఫోర్, 1 సిక్స్) అతడికి చక్కటి సహకారం అందించాడు. చెన్నై బౌలర్లలో తాహిర్‌కు 2 వికెట్లు దక్కాయి. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe