Breaking News

నటుడు రాళ్లపల్లి కన్నుమూత

May 17, 2019 10:57 by Admin Admin

ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు (73) కన్నుమూశారు. అనారోగ్యంతో మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1955 అక్టోబర్ 10న తూర్పు గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. 1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన 850 సినిమాల్లో నటించారు.  చిన్నతనం నుంచే నాటకాలు వేసేవారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా సేవలందించారు. ఎనిమిది వేలకుపైగా నాటకాల్లో నటించారంటే..నటనపై ఆయన ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe