Breaking News

విజేత జ‌ట్టుకు అత్య‌ధిక ప్రైజ్‌మ‌నీ

May 17, 2019 11:06 by Admin Admin

ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రో రెండు వారాల్లో ఇంగ్లండ్ వేదిక‌గా మెగా టోర్నీ అట్ట‌హాసంగా ప్రారంభంకానున్న‌ది. అయితే ఈ టోర్న‌మెంట్ చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టిసారి విజేత జ‌ట్టుకు అత్య‌ధిక ప్రైజ్‌మ‌నీ ఇవ్వ‌నున్నారు. ఫైన‌ల్ విజేత‌కు 28 కోట్ల‌ క్యాష్ అవార్డు ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. 10 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. లార్డ్స్‌లో జూలై 16వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ కోసం మొత్తం 10 మిలియ‌న్ల డాల‌ర్లు ప్రైజ్‌మ‌నీ కేటాయించారు. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచే జ‌ట్టుకు 14 కోట్ల ప్రైజ్‌మ‌నీ వ‌స్తుంది. సెమీఫైన‌ల్ చేరిన జ‌ట్ల‌కు 8 ల‌క్ష‌ల డాల‌ర్లు(5 కోట్ల 61 ల‌క్ష‌లు) ఇస్తారు.  46 రోజులు జ‌ర‌గ‌నున్న‌ది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. లీగ్ ద‌శ‌లోనూ ప్ర‌తి మ్యాచ్‌కు ప్రైజ్‌మ‌నీ ఉంది. ఈనెల 30వ తేదీన నుంచి వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు మొద‌లవుతాయి.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe