Breaking News

వైసీపీ భారీ విజయాన్ని నమోదుచేసింది

May 23, 2019 18:48 by Admin Admin

ఆంధ్రపదేశ్ అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్లో  వైసీపీ భారీ విజయాన్ని నమోదుచేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత స్వల్ప ఓటింగ్ శాతంతో అధికారాన్ని చేజార్చుకున్న వైసీపీ.. తాజా ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. ప్రజావ్యతిరేకత తీవ్రతకు నలభై ఏండ్ల అనుభవం తలవంచింది. ఏపీ ప్రజ.. యువశక్తికి పట్టం గట్టింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 150 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఫ్యాను గాలి తుఫాన్‌గా మారడంతో కొట్టుకుపోయిన సైకిల్.. 24 స్థానాలను గెలుచుకొన్నది. లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ ఎదురులేని శక్తిగా నిలిచింది. మొత్తం 25 ఎంపీ సీట్లకుగాను ఏకంగా 22 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe